పాద్రయాత చేసి సోనూసూద్‌ను కలిసిన తెలంగాణ యువకుడు
- June 11, 2021
తెలంగాణ: వికారాబాద్ జిల్లా లోని దోమ మండలం దోర్నాలపల్లికి చెందిన యువకుడు వెంకటేష్..రియల్ హీరో సోనూసూద్‌ను గురువారం కలిశాడు.సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు, కరోనా బాధితులకు చేస్తున్న సహాయానికి వెంకటేష్ ప్రేరణ పొందాడు.ఈ నేపథ్యంలో సోనూసూద్‌ను కలవాలనుకొని మే 31న వెంకటేష్..హైదరాబాద్ నుంచి ముంబైకు పాదయాత్రగా బయలుదేరాడు.హైవే మీదుగా ముంబై వెళ్తున్న వెంకటేష్ 9 రోజులు ప్రయాణం చేసి సోలాపూర్‌కు చేరుకున్నాడు.
అక్కడి నుంచి ముంబైకు ఇంకా 300 కిలోమీటర్లు పాదయాత్ర చేయాల్సి ఉండగా.. వెంకటేష్‌కు సోనూసూద్ ఫోన్ చేసి తాను కారు పంపిస్తున్నానని పాదయాత్ర ఆపేయాలని కోరాడు.దీంతో సోనూ పంపించిన కారులో వెంకటేష్ ముంబైకి చేరుకున్నాడు.అనంతరం వెంకటేష్‌కు సోనూసూద్ అక్కడే ఓ హోటల్లో బస ఏర్పాటు చేశాడు.గురువారం వెంకటేష్‌ను సోనూ ఇంటికి పిలిపించుకొని కలిశాడు.
ఈ సందర్భంగా వెంకటేష్ కుటుంబ సభ్యుల గురించి తెలుసుకున్నాడు.తన తండ్రి అంజిలయ్యకు వ్యవసాయం ఉందని..వ్యవసాయానికి అనుబంధంగా పాడి పశువులను కూడా సాకి ఆర్థికంగా ఎదుగాలని అనుకుంటున్నట్టు సోనూసూద్‌కు వెంకటేష్ సూచించాడు. దీంతో తన తండ్రికి గేదెలు ఇప్పిస్తానని వెంకటేష్‌కు సోనూ హామీ ఇచ్చాడు. పాడి గేదె పాలతో తయారైన స్వీటును కూడా తనకు తెచ్చి ఇవ్వాలని నవ్వుతూ వెంకటేష్ భుజం తట్టాడు సోనూసూద్. అయితే..వెంకటేష్ తిరుగు ప్రయాణానానికి కూడా సోనూసూద్ ఏర్పాటు చేస్తున్నట్లు వెంకటేష్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







