కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అమెరికా నిరాకరణ
- June 11, 2021
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అనుమతి నిరాకరించింది.వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి మరింత సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా చెబుతూ అనుమతులను నిరాకరించింది.కోవాగ్జిన్ తయారీకి అమెరికా భాగస్వామి అయిన ఆక్యుజెన్ ఫార్మా..అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసింది.అయితే, ఇప్పుడు ఎఫ్ డీఏ అనుమతులను తిరిస్కరించడంతో ఇక దానికి దరఖాస్తు చేయబోమని, అన్నీ పూర్తయ్యాక బయోలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్ ను పెట్టుకుంటామని ప్రకటించింది.
ఎఫ్డీఏ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని చెప్పింది. కోవాగ్జిన్ ను అమెరికా మార్కెట్లోకి విడుదల చేసేందుకు మరింత సమాచారం కావాల్సి ఉంటుందని పేర్కొంది.ఈ నిర్ణయంతో కోవాగ్జిన్ అమెరికాలో అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందని ఆక్యుజెన్ సీఈవో డాక్టర్ శంకర్ ముసునూరి చెప్పారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







