సా. 4 గంటల నుంచి అర్థరాత్రి వరకు డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ కేంద్రాలు

- June 11, 2021 , by Maagulf
సా. 4 గంటల నుంచి అర్థరాత్రి వరకు డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ కేంద్రాలు

ఖతార్: 300,000 మందికి పైగా వ్యక్తులు కోవిడ్ 19 డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ సెంటర్ల ద్వారా లబ్ది పొందినట్లు మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పేర్కొంది. కాగా, జూన్ 13 నుంచి ఈ కేంద్రాల పనివేళల్ని నియంత్రిస్తున్నట్లు మినిస్ట్రీ వివరించింది. అత్యంత వేడి వాతావరణం మొదలవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఇకపై డ్రైవ్ త్రూ సెంటర్లు పని చేయనున్నాయి. డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ కేంద్రాలు కేవలం రెండో డోసుల్ని మాత్రమే ఇస్తున్నాయి. ఇప్పటివరకు మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 1,176,240 మంది రెండు డోసుల వ్యాక్సిన్ పొందారు. గడచిన 24 గంటల్లో 19015 వ్యాక్సిన్లను అందించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com