3 రోజుల్లో 1,20,000 మందికి అస్ట్రాజెన్కా వ్యాక్సిన్

- June 13, 2021 , by Maagulf
3 రోజుల్లో 1,20,000 మందికి అస్ట్రాజెన్కా వ్యాక్సిన్

కువైట్: దేశవ్యాప్తంగా మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టిన కువైట్..గత మూడు రోజుల్లో 1,20,000 మందికి ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెన్కా వ్యాక్సిన్ అందించినట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పెద్ద ఎత్తున చేపట్టిన ఈ డ్రైవ్ లో ఇప్పటికే ఆస్ట్రాజెన్కా తొలి డోస్ పొందిన  వారికి రెండో డోస్ అందించారు. నిజానికి రష్యా నుంచి మే10న మూడో విడతగా 4 లక్షల టీకా డోసులు కువైట్ చేరుకున్నాయి. కానీ, మూడో బ్యాచ్ వ్యాక్సిన్ నాణ్యత, భద్రతకు సంబంధించి నిర్వహించిన టెస్ట్ రిపోర్టులు ఆలస్యం కావటంతో ఇన్నాళ్లుగా టీకాలను స్టోర్ రూమ్స్ లో భద్రపరిచారు. అయితే..గత బుధవారం వ్యాక్సిన్ రిపోర్టులు రావటంతో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. మూడు నెలల క్రితం ఆస్ట్రాజెన్కా ఫస్ట్ డోస్ తీసుకున్న రెండు లక్షల మందికి ప్రస్తుత డ్రైవ్ తో సెకండ్ డోస్ అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కువైట్ ఆరోగ్య శాఖ తెలిపింది. పది రోజుల్లో 30 వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా లక్ష్యాన్ని అందుకుంటామని వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com