ఆన్ లైన్ లో 3 రకాల డ్రైవింగ్ లైసెన్సింగ్ సేవలు
- June 14, 2021దుబాయ్: ఆర్టీఏ సేవలను ఒక్కోటిగా ఆన్ లైన్ చేస్తూ వస్తున్న దుబాయ్ ఆర్టీఏ..ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్సింగ్ కు సంబంధించి మూడు రకాల సేవలను ఆన్ లైన్ పరిధిలోకి తీసుకొచ్చింది.డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్,పోయిన,డ్యామేజ్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ ల స్థానంలో కొత్త లైసెన్స్ జారీ, డ్రైవర్లకు ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ల జారీ సేవలను ఇకపై పూర్తి ఆన్ లైన్ చేస్తున్నట్లు ప్రకటించింది.మిడ్ జూన్ ఈ మూడు సేవలు కేవలం ఆన్ లైన్ కే పరిమితం కానున్నాయి.లైసెన్స్ రెన్యూవల్, రిప్లేస్మెంట్,డ్రైవర్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ కోసం దుబాయ్ ఆర్టీఏ యాప్ లేదా ఆర్టీఏ వెబ్ సైట్ http://www.rta.ae ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఆర్టీఏ ఆన్ లైన్ సేవల వల్ల రెండు రోజులు పట్టే పనులు కేవలం 15 నిమిషాల్లో పూర్తి అవుతుంది. అంతేకాదు నాలుగుసార్లు ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండేది.కానీ, ఇప్పుడు అంతా ఆన్ లైన్లోనే పూర్తి చేయవచ్చు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు