గవర్నర్ తో ఏపీ సిఎం జగన్ భేటీ
- June 14, 2021
అమరావతి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సతీసమేతంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్లు ఆమోదంపై చర్చించారు. ఇప్పటికే తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోసేన్‌రాజు, రమేశ్ యాదవ్ పేర్లను ప్రభుత్వం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. అభ్యర్థుల ఎంపిక విధానం, ప్రాధాన్యత అంశాలను గవర్నర్‌కు సీఎం వివరించారు. నామినేటెడ్ పదవుల భర్తీపైనా చర్చించారు. 80 కార్పొరేషన్లు, 960 డైరెక్టర్ల పదవుల భర్తీకి సీఎం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై గవర్నర్ సూచనలను సీఎం తీసుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలపైనా, కరోనా నియంత్రణ వంటి అంశాలపై గవర్నర్‌తో చర్చించారు.


తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







