గవర్నర్ తో ఏపీ సిఎం జగన్ భేటీ

- June 14, 2021 , by Maagulf
గవర్నర్ తో ఏపీ సిఎం జగన్ భేటీ

అమరావతి: ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సతీసమేతంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పేర్లు ఆమోదంపై చర్చించారు. ఇప్పటికే తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోసేన్‌రాజు, రమేశ్‌ యాదవ్‌ పేర్లను ప్రభుత్వం గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లింది. అభ్యర్థుల ఎంపిక విధానం, ప్రాధాన్యత అంశాలను గవర్నర్‌కు సీఎం వివరించారు. నామినేటెడ్‌ పదవుల భర్తీపైనా చర్చించారు. 80 కార్పొరేషన్లు, 960 డైరెక్టర్ల పదవుల భర్తీకి సీఎం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై గవర్నర్‌ సూచనలను సీఎం తీసుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలపైనా, కరోనా నియంత్రణ వంటి అంశాలపై గవర్నర్‌తో చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com