భారత్ లో కరోనా కేసుల వివరాలు

- June 15, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.మొన్నటి వరకు భారీగా పెరిగిన కరోనా కేసులు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి.ఈరోజు కూడా లక్ష లోపే కేసులు నమోదయ్యాయి.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 60,471 కి చేరింది.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,95,70,881 కి చేరింది.ఇందులో 2,82,80,472 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,13,378 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో ఇండియాలో 2726 కరోనా మరణాలు సంభవించాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,77,031 కి చేరింది.ఇక దేశంలో ఇప్పటి వరకు 25,90,44,072 మందికి వ్యాక్సిన్ అందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com