రాత్రి 8 గంటల వరకు రెస్టారెంట్లకు అనుమతి

- June 15, 2021 , by Maagulf
రాత్రి 8 గంటల వరకు రెస్టారెంట్లకు అనుమతి

కువైట్: కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తి తొలిగిపోనందున కమర్షియల్ కాంప్లెక్స్, రెస్టారెంట్లపై ఆంక్షలు కొనసాగించాలని కువైట్ మంత్రి మండలి నిర్ణయించింది. అయతే..వైరస్ తీవ్రత మునుపటి స్థాయిలో లేకపోవటంతో కొద్దిమేర సడలింపులు ఇచ్చింది. రెస్టారెంట్ల క్లోజింగ్ సమయాన్ని పొడిగించింది.రాత్రి 8 గంటల వరకు రెస్టారెంట్లను నిర్వహించుకోవచ్చని మంత్రి మండలి స్పష్టం చేసింది.అయితే..ఓపెనింగ్ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. ఇదిలాఉంటే..కోవిడ్ నేపథ్యంలో పిల్లల ఆట వస్తువుల అమ్మకాలు, హుక్కా కేంద్రాలను మరికొంత కాలం మూసివేయాలని నిర్ణయించింది. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్) 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com