శానిటైజేషన్ తర్వాత 7 మసీదుల్లో ప్రార్థనలకు అనుమతి
- June 15, 2021
సౌదీ: కోవిడ్ కేసులు నమోదవటంతో మూతపడిన ఏడు మసీదుల్లో తిరిగి ప్రార్థనలకు అనుమతిస్తున్నట్లు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మూడు ప్రాంతాల్లోని ఏడు మసీదులను కోవిడ్ కారణంగా తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. అయితే..శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టిన తర్వాత ఖాసిమ్, జజాన్లలో ఒక్కొక్కటి, రియాద్‌లో ఒక మసీదుతో పాటు మొత్తం ఏడు మసీదులను తిరిగి తెరిచినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ కారణంగా గత 127 రోజులలో కింగ్డమ్ వ్యాప్తంగా మొత్తం 1,562 మసీదులను తాత్కాలికంగా మూసివేయవలసి వచ్చింది. శానిటైజ్ చేయటంతో పాటు కోవిడ్ కేసులను ట్రేస్ చేసిన తర్వాత మళ్లీ ప్రార్థనలకు అనుమతి ఇస్తూ వస్తున్నారు. వైరస్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భక్తులు అందరూ తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించటంతో పాటు..భౌతిక దూరం పాటించాలని, ప్రార్థనా మ్యాట్లను ఎవరివి వారే తెచ్చుకోవాలని మంత్రిత్వ శాఖ మరోసారి సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







