చార్ధామ్ యాత్రకు అనుమతి వాయిదా
- June 15, 2021
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల ప్రజలు చార్ ధామ్ యాత్ర చేపట్టవచ్చని ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం నిలిపివేసింది. ఆ మూడు జిల్లాల వాసులకు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మంత్రి సుబోధ్ ఉనియాల్ వెల్లడించారు. రేపు నైనిటాల్ హైకోర్టు ముందుకు చార్ ధామ్ యాత్రపై నమోదైన కేసు విచారణకు రానుంది.ఈ నేపథ్యంలో వాయిదావేస్తున్నట్లు, జూన్ 16 తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. చమోలీ, రుద్రప్రయాగ్, ఉత్తర కాశీ జిల్లాల భక్తులు చార్ధామ్ యాత్ర దేవాలయాలైన బదరీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి-యమునోత్రిలను దర్శించుకునేందుకు అనుమతించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి, కేబినెట్ మినిస్టర్ సుబోధ్ ఉనియాల్ సోమవారం చెప్పారు.
కాగా, హిమాలయాల్లో ఉన్న కేదార్నాథ్, బద్రినాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలను కలిపి చార్ ధామ్ అని పిలుస్తారు. ఈ క్షేత్రాలు మే నెలలో తెరచుకున్నాయి. అప్పటి నుంచి రోజువారీ పూజలు జరుగుతున్నప్పటికీ భక్తులకు అనుమతినివ్వడం లేదు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







