పబ్లిక్ ప్రాంతాల్లో న్యూస్ పేపర్లు, మ్యాగజైన్ ల పంపిణీకి యూఏఈ గ్రీన్ సిగ్నల్

- June 16, 2021 , by Maagulf
పబ్లిక్ ప్రాంతాల్లో న్యూస్ పేపర్లు, మ్యాగజైన్ ల పంపిణీకి యూఏఈ గ్రీన్ సిగ్నల్

యూఏఈ: కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పలు రంగాలకు సడలింపులు ఇస్తున్న యూఏఈ ప్రభుత్వం తాజాగా న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక నుంచి యుఎఇలోని హోటళ్ళు, కేఫ్‌లు, రెస్టారెంట్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో వార్తాపత్రికలు, పత్రికలు పంపిణీ చేసుకోవచ్చు. మీడియా సంస్థలతో సమావేశం తర్వాత సాంస్కృతిక, యువజన మంత్రిత్వ శాఖలోని మీడియా రెగ్యులేటరీ కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా వార్తాపత్రికలు, మ్యాగజైన్స్ మార్కెటింగ్ ను,  పంపిణీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని యుఎఇ నేషనల్ మీడియా కౌన్సిల్ (ఎన్‌ఎంసి) మార్చి 2020 లో ఆదేశించిన విషయం తెలిసిందే.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com