గాజాపై మళ్లీ భీకర దాడులు
- June 16, 2021
గాజా: దశాబ్దాలుగా నలుగుతున్న ఇజ్రాజెల్-పాలస్తీనా సమస్య మరోసారి తెరపైకి వచ్చింది.నెల రోజుల క్రతం ఈజిప్ట్, అమెరికా చొరవతో ఇజ్రాయిల్ కాల్పుల విరమణను ప్రకటించింది. అయితే, కొన్ని రోజుల క్రితం ఇజ్రాయిల్ కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది.గాజా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటారని అనుకున్నారు.కానీ, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన మూడోరోజే గాజాపై ఇజ్రాయల్ బాంబుల వర్షం కురిపించింది.గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో దాడులు చేసింది.అయితే, ఈ దాడుల్లో ఎంతమంది మరణించారు అనే విషయాన్ని బయటపెట్టలేదు.ప్రమాదకరమైన వాయువులు కలిగిన బెలూన్లను గాజా సరిహద్దుల్లో వదులుతున్నారని, వీటి కారణంగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది.ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్ గాజాపై వైమానిక దాడులు చేసింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







