దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న భారత వలసదారుడు

- June 16, 2021 , by Maagulf
దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న భారత వలసదారుడు

దుబాయ్: అబ్రహాం జోయీ అనే దుబాయ్ వాసి అయిన భారత వ్యాపారవేత్త 1 మిలియన్ డాలర్లను దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ లో గెలుచుకున్నారు. 60 ఏళ్ళ అబ్రహాం, ఓ ట్రేడింగ్ కంపెనీ నడుపుతున్నారు. మే 27న 1031 టిక్కట్టుని కొనుగోలు చేశారు. ఈ విజయం చాలా అద్భుతమని ఆయన చెప్పారు. 35 ఏళ్ళుగా దుబాయ్ వాసిగా వున్నానని చెప్పారాయన. వ్యాపారంలోనే ఈ సొమ్ముని పెడతాననీ, కొంత మొత్తం సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తాననీ బహుమతిగా లభించిన సొమ్ము పై వివరణ ఇచ్చారాయన. మూడు లగ్జరీ కార్లు కూడా ఈ ర్యాఫిల్ లో విజేతల్ని వరించాయి. సంజయ్ అస్నానీ లనే 32 ఏళ్ళ భారత జాతీయుడు ఖరీదైన మోటర్ బైక్ గెలుచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com