నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డికి మరో అరుదైన అవకాశం

- June 16, 2021 , by Maagulf
నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డికి మరో అరుదైన అవకాశం

హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డికి మరో అరుదైన అవకాశం దక్కింది. అంతర్జాతీయ ఎంటర్ టైన్ మెంట్ లో లెజెండ్ గా పేరున్న కంపెనీ సోని తన ఓటీటీ విభాగం 'సోని లివ్' తెలుగు కంటెంట్ హెడ్ గా మధుర శ్రీధర్ రెడ్డిని నియమించుకుంది. తమ ఓటీటీలో వర్సటైల్ తెలుగు కంటెంట్ ను పెంచేందుకు శ్రీధర్ రెడ్డి అనుభవం, ప్యాషన్ బాగా ఉపయోగపడతాయని సోని లివ్ మేనేజ్ మెంట్ గట్టి నమ్మకంతో ఉంది. సోని ఎంటర్ టైన్ మెంట్ టెలివిజన్, సోని లివ్ కంటెంట్ హెడ్ ఆశిష్ గోల్వాకర్ మాట్లాడుతూ...సోని లివ్ తెలుగు కంటెంట్ హెడ్ గా మధుర శ్రీధర్ రెడ్డి మాతో జాయిన్ అవడం సంతోషంగా ఉంది. తనకున్న అనుభవంతో వీక్షకులకు నచ్చే వైవిధ్యమైన కంటెంట్ ను ఆయన సోని లివ్ కు తీసుకొస్తారని ఆశిస్తున్నాం.అన్ని వర్గాల వీక్షకులు ఇష్టపడేలా సోని లివ్ ను శ్రీధర్ రెడ్డి డెవలవ్ చేస్తారని నమ్మకం ఉందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com