12-17 ఏళ్ల వారికి వ్యాక్సిన్ వేయించాలని కోరిన బహ్రెయిన్

- June 17, 2021 , by Maagulf
12-17 ఏళ్ల వారికి వ్యాక్సిన్ వేయించాలని కోరిన బహ్రెయిన్

బహ్రెయిన్: కోవిడ్ వేరియంట్లతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉందని నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ పిలుపునిచ్చింది.
ముఖ్యంగా 12-17 ఏళ్ల వారికి వారి తల్లిదండ్రులు టీకాలు వేయించాలని టాస్క్ ఫోర్స్ సభ్యుడు, మైక్రోబయాలిస్ట్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ మనఫ్ అల్ ఖహ్తానీ అన్నారు. రానున్న రోజుల్లో డెల్టా వేరియంట్ తో ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కొత్త వేరియంట్లతో అన్ని వర్గాలపై ప్రభావం ఉంటుందని, ప్రధానంగా పిల్లలపై ఎక్కువ  ప్రభావం ఉండే అవకాశాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడే వ్యాక్సిన్ వేయించుకోవటం ద్వారా వైరస్ తీవ్రతను నియంత్రించేందుకు ఆస్కారం ఉంటుందని మనఫ్ అల్ కహ్తానీ అన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com