వ్యాక్సిన్లు తీసుకున్న ప్రవాసీయులను అనుమతిస్తారా?
- June 17, 2021
కువైట్: కరోనా నేపథ్యంలో కువైట్ ట్రావెల్ బ్యాన్ ను విధించిన సంగతి తెలిసిందే. దీంతో, వివిధ కారణాల చేత తమ దేశాలకు వెళ్ళిన ఎందరో ప్రవాసీయులు అక్కడే చిక్కుపోయారు. ఎందరో తమ కష్టాలను అటు భారత ప్రభుత్వానికి, ఇటు నివసిస్తున్న ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటున్నారు. భారత్ అంతర్జాతీయ విమానాలపై జులై 6 వరకు బ్యాన్ విధించింది. గడువు పూర్తవుతుండడంతో ప్రవాసీయులలో ఆత్రుత నెలకొంది.
అయితే, ఎవరైతే వ్యాక్సిన్లు తీసుకున్నారో వాళ్ళను కువైట్ కు అనుమతించాలంటూ మంత్రిమండలికి సిఫారసు చేసింది సుప్రీం కమిటీ ఫర్ కరోనా ఎమర్జెన్సీ.
కువైట్ లో తాజాగా 'డెల్టా వేరియంట్' నమోదవడంతో పరిస్థితులను మరింత జాగ్రత్తగా అంచనావేస్తోంది కువైట్ ప్రభుత్వం. సుప్రీం కమిటీ చేసిన సిఫారసును మంత్రి మండలి చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటుంది అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







