భారత్ లోని అన్ని వాహనాలకు ఒకే సర్టిఫికేట్
- June 17, 2021
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఒకే విధమైన కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్‌ను జారీ చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. అలాగే, కొత్తగా తిరస్కరణ సర్టిఫికేట్’ విధానాన్ని తెచ్చినట్టు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రిత్వ శాఖ ఇకమీదట అన్ని వాహనాలకు కాలుష్య నియంత్రణ(పీయూసీ) ధృవీకరణ సర్టిఫికేట్ జారీ చేయనున్నట్టు స్పష్టం చేసింది.
దీనిపై క్యూఆర్ కోడ్‌ను కూడా ముద్రించనున్నట్టు, అదేవిధంగా పీయూసీ డేటాను నేషనల్ రిజిస్టర్‌కు లింక్ చేయనున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా 1989 మోటార్ వాహనాల నిబంధనల్లో మార్పులు చేసినట్టు కేంద్రం పేర్కొంది. అలాగే, మొదటిసారిగా తిరస్కరణ పత్రం అనే విధానాన్ని ప్రారంభిస్తున్నట్టు నోటిఫికేషన్‌లో తెలిపింది. అనుమతించిన స్థాయి కంటే ఎక్కువగా ఉద్గారాలు వెలువడుతున్నట్టుగా తేలితే ఈ తిరస్కరణ సర్టిఫికేట్‌ను వాహన యజమానికి ఇవ్వనున్నారు. కొత్త నిబంధనలు పాటించకపోతే వాహన రిజిస్ట్రేషన్‌తో పాటు పర్మిట్‌ను రద్దు చేసే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్







