ఫ్రంట్ లైన్ వర్కర్లకు ధన్యవాదాలు తెలుపుతూ పోస్టల్ స్టాంప్

- June 18, 2021 , by Maagulf
ఫ్రంట్ లైన్ వర్కర్లకు ధన్యవాదాలు తెలుపుతూ పోస్టల్ స్టాంప్

సౌదీ: కోవిడ్ ను ఎదుర్కొనేందుకు నిరంతరంగా శ్రమిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు ధన్యవాదాలు తెలుపుతూ సౌదీ ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ తో పాటు పోస్ట్ కార్డును విడుదల చేసింది. వారి సేవలకు గుర్తింపుగా SR3 పోస్టల్ స్టాంప్, SR5 పోస్ట్‌కార్డ్‌ లపై 'మా హీరోలకు ధన్యవాదాలు' అనే టైటిల్ ను ముద్రించింది. ప్రణాంతకమైన వైరస్ పై పోరాటంలో ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు, దేశ ప్రజల పట్ల అంకితమైన భావంతో విధులు నిర్వహిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్ల సేవలను కొనియాడింది. ఇదిలాఉంటే..జాతీయ, అంతర్జాతీయ, మతపరమైన ఈవెంట్లతో పాటు ముఖ్యమైన సెలవులు, హజ్ సీజన్, కళాత్మక, సాంస్కృతిక, క్రీడల నిర్వహణ సమయంలో వాటి ప్రాముఖ్యతను చాటేలా పోస్టల్ స్టాంప్ విడుదల చేయటం పరిపాటిగా వస్తోంది. అలాగే  అంతర్జాతీయ, ఇస్లామిక్, అరబ్, గల్ఫ్ స్థాయిలలో సమావేశాల సమయంలో సౌదీ విజయాలు చాటిచెప్పేలా తపాలా బిళ్ళలను సౌదీ ప్రభుత్వం జారీ చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ లైన్ వర్కర్లకు ధన్యవాదాలు తెలుపుతూ వారి సేవలను కీర్తిస్తూ పోస్టల్ స్టాంప్, పోస్టల్ కార్డులను విడుదల చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com