భవనంపై నుంచి పడి.. భారత యువకుడి దుర్మరణం!
- June 18, 2021
యూఏఈ: షార్జాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భారత్‌కు చెందిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు భవనం పై నుంచి కింద పడి చనిపోయాడు. అదే భవనంలో ఉండే కొందరితో గొడవ పడ్డ యువకుడు వారి నుంచి తప్పించుకునే క్రమంలో భవనం పై నుంచి పడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు షార్జా పోలీసులు తెలిపారు. మృతుడిని టీవీ విష్ణు(29)గా గుర్తించారు. షార్జాలోని అబు షాగ్రాలో ఈ ఘటన జరిగింది. విష్ణు నివాస ముండే భవనంలోనే కొందరు ఆఫ్రికన్లు ఉన్నారు. విష్ణుతో వారు ఘర్షణ పడ్డారు.ఈ క్రమంలో ఆఫ్రికన్ల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన విష్ణు కాలు జారి కింద పడ్డాడు.తీవ్రంగా గాయపడ్డ విష్ణు అక్కడికక్కడే చనిపోయాడు.మెదడులో ఇంటర్నల్ బ్లీడిండ్ కావడంతోనే విష్ణు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన షార్జా పోలీసులు కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, అబు షాగ్రాలో విష్ణు ఓ సెలూన్‌లో పని చేస్తున్నట్లు తెలిసింది.ఈ కేసులో పోలీసులు కొన్ని అరెస్టులు చేసి నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు.
ధృవీకరించని సమాచారాన్ని ప్రసారం చేయవద్దని పోలీసులు నివాసితులకు సూచించారు, ఎందుకంటే ఇది నివాసితులలో భయాందోళనలకు గురి చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్‌లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్‌లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







