ఖతార్ లో తెలుగోడి మోసం
- June 19, 2021
విశాఖపట్నం: విశాఖపట్నానికి చెందిన పిన్నింటి సుబ్రహ్మణ్య శ్రీనివాస్ దోహా లో అల్ మీరా కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ లో బయ్యర్స్ డిపార్ట్మెంట్ హెడ్ గా పని చేస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా ఖతార్ నుంచి ఇండియాకు నిధులు పంపి,పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు.రూ.88 లక్షల పెట్టుబడులను ఫ్రీజ్(నిలుపుదల) చేశారు.
విశాఖకు చెందిన పిన్నింటి సుబ్రహ్మణ్య శ్రీనివాస్ దోహా లో ఉంటున్నారు. అక్కడి దోహా నేషనల్ బ్యాంకు నుంచి విశాఖలోని యాక్సిస్,హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకులకు రూ.45 లక్షలు బదిలీ చేశారు. వాటిని తన పేరిట మరియు ఆయన భార్య పేరిట మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టారు. సమాచారం అందుకున్న ఈడీ అధికారులు ఈ నెల 15న సీతమ్మధారలోని శ్రీనివాస్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులతో పాటు.. మరో రూ.43 లక్షలతో మూడు ఇళ్ల స్థలాలు..చీపురువాలస,విజయనగరం జిల్లా మరియు విశాఖపట్నంలోని తాటిటూర్,గిడిజాలా గ్రామాలు దగ్గర కొనుగోలు చేసినట్టు గుర్తించారు.
ఇదిలా ఉండగా, జరిగిన ఘటన పై దర్యాప్తు జరిపి, శ్రీనివాస్ లంచం మొత్తంలో కూడబెట్టిన ఆస్తుల వివరాలను తెలుసుకొని..విచారణ అయ్యేవరకు వాటిని సీజ్ చేయవలసిందిగా ఈడీ ను కోరింది దోహాలోని ఒనైజా పోలీస్ స్టేషన్‌లోని పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కార్యాలయం.
తాజా వార్తలు
- AVPN హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం
- అండర్-19 వన్డే వరల్డ్ కప్ విజేత భారత్..
- ఇరాన్‌తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?
- ఏపీ రవాణా శాఖ కీలక అడుగు..
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!









