వాహనమిత్ర పథకం ఎంతో ఉపయోగపడుతుంది: ఏపీ హోం మంత్రి
- June 19, 2021
గుంటూరు: గుంటూరు నగరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మాత్యులు మేకతోటి సుచరిత పాల్గొనడం జరిగింది.స్వర్ణభారతి నగర్ లో వాహన మిత్ర లబ్ధిదారులు ఏర్పాటు చేసిన కార్యకమనికి హోంమంత్రి ముఖ్య అతిధిగా విచ్చేసారు. వాహనమిత్ర లబ్దిదారులకు మూడవ విడతగా 10 వేల రూపాయలు ఇచ్చిన సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.హోంమంత్రి సుచరిత తో పాటు డివిజన్ కార్పోరేటర్లు, స్థానిక వైస్సార్సీపీ నాయకులు, ఆటో డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఆటో డ్రైవర్ల కష్టాలను, బాధలను తెలుసుకొని అధికారంలోకి వచ్చినవెంటనే 10 వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.గుంటూరు జిల్లా లో 22, 218 మంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు లబ్ధిచేకూరిందన్నారు. ఈ వాహన మిత్ర పథకం భారత దేశంలో ఎక్కడా కూడా లేదన్నారు. ఆటో డ్రైవర్లు ఇన్సూరెన్స్, ఫినెటెస్, ఆటో రిపేర్ లాంటి వాటికి ఈ వాహన మిత్ర పథకం ఎంతో ఉపయోగపడుతోందని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు.


తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







