'ఓకే టు బోర్డ్‌' అంటే ఏమిటి?

- March 07, 2016 , by Maagulf
'ఓకే టు బోర్డ్‌' అంటే ఏమిటి?

దుబాయ్‌కి వెళ్ళే ప్రయాణీకులు తమ వీసా వెరిఫికేషన్‌ని పూర్తి చేసుకోవలసి ఉంటుంది. వెరిఫికేషన్‌ తర్వాత, సంబంధిత అధికారి 'ఓకే టు బోర్డ్‌' మెసేజ్‌ని పిఎన్‌ఆర్‌లో ఇన్‌సెర్ట్‌ చేస్తారు. భారతీయ పాస్‌పోర్ట్‌ ఉన్నవారంతా 'ఓకే టు బోర్డ్‌'ను పొందవలసి ఉంటుంది. యూఏఈ (దుబాయ్‌, షార్జా మరియు అబుదాబీ)కి వెళ్ళాలనుకుంటే పిఎన్‌ఆర్‌ ఖచ్చితంగా 'ఓకే టు బోర్డ్‌' అనే మార్కింగ్‌ పొందవలసి ఉంటుంది. వీసా వచ్చిన తర్వాత వీసా కాపీని ఎయిర్‌లైన్‌కి రీ-చెకింగ్‌ కోసం పంపాలి. వీసాని చెక్‌ చేసిన తర్వాత ఎయిర్‌లైన్స్‌ సంస్థ అప్రూవల్‌ ఇస్తుంది. ఓకే టు బోర్డ్‌ అని లేకపోతే ప్రయాణానికి అనుమతించరు. యూఏఈకి వెళుతున్నవారిలో చాలామంది ఫేక్‌ వీసాల ద్వారా వెళ్తుండడంతోనే ఈ చర్యలను చేపట్టారు. మామూలుగా అయితే సంబంధిత స్పాన్సరర్లు 'ఓకే టు బోర్డ్‌'ని పూర్తి చేస్తారు. వారే పిఎన్‌ఆర్‌ మరియు చెల్లబాటు అయ్యే వీసా కాపీని ఎయిర్‌లైన్స్‌ అధికారులకు పంపుతారు. ఎయిర్‌లైన్స్‌ సంస్థ వెరిఫై చేసి, 'ఓకే టు బోర్డ్‌' మెసేజ్‌ని పిఎన్‌ఆర్‌లో పేర్కొంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com