ఇతర దేశాల్లో నుంచి కూడా ఆన్ లైన్లో రెసిడెన్సీ రెన్యూవల్
- June 22, 2021
కువైట్: అన్ని రకాల వీసాదారులు ఇక నుంచి ఆన్ లైన్లో కూడా రెసిడెన్సీ రెన్యూవల్ చేసుకోవచ్చని జనరల్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ స్పష్టం చేసింది. వివిధ కారణాలతో విదేశాల్లో చిక్కుబడిపోయిన ప్రవాసీయుల కోసం ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. అంటే ట్రావెల్ బ్యాన్ కారణంగా కువైట్ ప్రవాసీయులు వారి వారి సొంత దేశాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అలాంటి వారు ఏ ఇబ్బంది లేకుండా అంతర్గత మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లోనే రెసిడెన్సీ పర్మిట్ రెన్యూవల్ చేసుకునేందుకు వీలుంటుంది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా కువైట్ వెలుపల ఉన్న ప్రవాసీయులకు రెసిడెన్సీ రెన్యూవల్ అవకాశం లేదనే వదంతులను నమ్మొద్దని స్పష్టం చేశారు. అలాగే ఆరు నెలల కంటే ఎక్కువ కాలం పాటు కువైట్ లో లేని ప్రవాసీయులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. రెసిడెన్సీ పర్మిట్ గడువు ఉన్నంత కాలం వారిని కువైట్‌లోకి అనుమతిస్తామని వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వారిపై ఎలాంటి నిషేధం ఉండదన్నారు. ఇదిలాఉంటే ప్రస్తుతం కువైట్‌లో రెండు లక్షల మంది ప్రవాసీయులు రెసిడెన్సీ రెన్యూవల్ లేకుండా అక్రమంగా ఉంటున్నారని, వారిపై రెండు నెలల్లో చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!