భారత్-దోహా వెళ్లే ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు...
- June 24, 2021
దోహా: భారత్ కు చెందిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ భారత్ నుండి ఖతార్ వెళ్లే ప్రయాణికులకు కొత్త ప్రయాణ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రయాణికులు తప్పనిసరిగా పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే ప్రత్యేకమైన పోర్టల్ నుంచి 10 రోజుల పాటు ఉండేందుకు హోటల్ రూమ్ బుక్ చేసుకోవడం కూడా తప్పనిసరి.ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కొత్త ప్రయాణ మార్గదర్శకాల వివరాలు...
- ICMR ఆమోదం తెలిపిన లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి తీసుకున్న నెగెటివ్ కోవిడ్-19 పీసీఆర్ టెస్టు సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- విమానం బయల్దేరడానికి 48 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకోవాలి.
- తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్‌లో Ehteraz app డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ప్రయాణికులు తప్పనిసరిగా ఈ సర్టిఫికెట్ల ప్రింట్ కాపీలు తీసుకెళ్లాలి.
a) నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్
b) క్వారంటైన్‌లో ఉండేందుకు హోటల్ బుకింగ్‌కు సంబంధించిన ప్రూఫ్
c) ప్రవేశ అనుమతి
d) నింపిన హెల్త్ అసెస్మెంట్ ఫారం
- వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు దాని తాలూకు సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- 10 రోజుల క్వారంటైన్ కోసం Discover Qatar పోర్టల్ నుంచి మాత్రమే హోటల్ రూమ్ బుక్ చేసుకోవాలి. --రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







