శంషాబాద్ విమానాశ్రయంలో విలువైన ఐఫోన్లు పట్టివేత
- June 24, 2021
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో తాజాగా గురువారం మరో అక్రమ రవాణా బయటపడింది.శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులు భారీగా ఐఫోన్లను సీజ్ చేశారు.
షార్జా నుంచి వచ్చి ఇద్దరు ప్రయాణికులు 80 ఐ ఫోన్లను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న అధికారులు సోదాలు నిర్వహించారు.పట్టుబడ్డ ఇద్దరిని పోలీసులు విచారించారు.పట్టుబడ్డ ఐఫోన్లను సీజ్ చేసిన పోలీసులు విమానాశ్రయం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.కాటన్లలో భారీగా తరలిస్తున్న ఫోన్లను చూసిన అధికారులు షాక్ అయ్యారు.
ఇదిలా ఉంటే తాజాగా మూడు రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టుబడిన విషయం తెలిసిందే.టాంజానియా నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తి నుంచి పెద్దమొత్తంలో హెరాయిన్ ను పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. టాంజానియా దేశస్తుడు జాన్ విలియమ్స్ నుంచి దాదాపు 20 కోట్ల విలువ చేసే డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







