ఒమన్: సినోవాక్, స్పుత్నిక్ వ్యాక్సిన్లకు ఆమోదం

- June 25, 2021 , by Maagulf
ఒమన్: సినోవాక్, స్పుత్నిక్ వ్యాక్సిన్లకు ఆమోదం

ఒమన్: డెల్టా వేరియంట్ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ను మరింత ముమ్మరం చేసే దిశగా ఒమన్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా స్పుత్నిక్, సినోవాక్ కోవిడ్ వ్యాక్సిన్లకు కూడా ఒమన్ తెలిపింది. ఆగస్ట్ చివరి నాటికి టార్గెట్ గ్రూప్ ప్రజలు అందరికీ కనీసం ఒక్క డోస్ అన్న అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒమన్ లో ఫైజర్ బయోన్టెక్, అస్ట్రాజెన్కాతో పాటు సినోవాక్, స్నుత్నిక్ వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. కోవిడ్ వైరస్ ఆందోళనకరంగా మ్యూటేషన్ చెందుతోందని...బీటా, గామా, అల్ఫాకు తోడుగా ఇప్పుడు డెల్టా వేరియంట్ కూడా ఒమన్ లో గుర్తించినట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ వేరియంట్లలో డెల్టా వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండటం దాంతో పొంచి ఉన్న ప్రమాద తీవ్రతను తెలుపుతోందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అలర్టైన ఒమన్ ఆరోగ్యశాఖ ప్రస్తుతం సినోవాక్, స్పుత్నిక్ వ్యాక్సిన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలాఉంటే వైరస్ వేరియంట్ల వ్యాప్తి తీవ్రత పెరుగుతుండటంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com