హెల్త్‌కేర్‌కు ఎస్బీఐ రుణ పథకం
- June 25, 2021
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ హెల్త్‌కేర్ సంస్థల కోసం ఒక కొత్త రుణ పథకాన్ని ప్రారంభించింది. ఆరోగ్యం హెల్త్‌కేర్ వ్యాపార రుణం పేరుతో మొదలైన ఈ స్కీము ద్వారా గరిష్ఠంగా రూ.100 కోట్ల వరకూ రుణం లభిస్తుందని ఎస్బీఐ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. హాస్పిటళ్లు, నర్సింగ్‌హోంలు, డయాగ్నస్టిక్ సెంటర్లు, పాథాలాజీ లాబ్‌లు, హెల్త్‌కేర్ పరికరాల తయారీదారులు, సరఫరాదారులు, దిగుమతిదారులు, రవాణా సంస్థలు ఈ రుణాన్ని పొందవచ్చు. రుణ చెల్లింపు కాలపరిమితి 10 సంవత్సరాలు. ఈ ఆరోగ్యం రుణాన్ని టెర్మ్‌రుణంగా లేదా వర్కింగ్ క్యాపిటల్ రుణ సదుపాయంగా పొందవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. రూ. 2 కోట్ల వరకూ రుణం తీసుకునే సంస్థలు ఎటువంటి సెక్యూరిటీని బ్యాంకుకు సమర్పించనవసరం లేదని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా చెప్పారు.ఇటీవల రిజర్వుబ్యాంక్ కొవిడ్ లోన్‌బుక్ ద్వారా హెల్త్‌కేర్ రంగానికి రుణం ఇచ్చే అవకాశాన్ని బ్యాంకులకు కల్పించడంతో ఎస్బీఐ ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది.
తాజా వార్తలు
- కామాంధుల్లో చావు భయం కలగాలి.. పోలీసులకు సుప్రీం ఆదేశం
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!
- కువైట్‌లో 8 నెలల్లో KD 10 బిలియన్ దాటిన POS చెల్లింపులు..!!
- జబల్ అల్ సవాదిలో సముద్ర జీవుల రక్షణకు స్పెషల్ డ్రైవ్..!!
- తాబేళ్లపై ఎక్కి వీడియోలు.. ఇద్దరు విదేశీయులకు ఒమన్‌లో జైలు శిక్ష..!!
- జీసీసీ దేశాల నుంచి రికార్డు స్థాయిలో కార్మికుల రెమిటెన్సులు..!!
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్







