కొవాగ్జిన్‌కు ఫిలిప్పీన్స్ గ్రీన్ సిగ్నల్
- June 25, 2021
మనీలా: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఫిలిప్పీన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారమే తాము అనుమతి ఇచ్చినట్లు ఫిలిప్పీన్స్ ఫుడ్ అండ్ డ్రగ్ ఏజెన్సీ వెల్లడించింది. అవసరమైన అన్ని పత్రాలను సమర్పించడంతో కొవాగ్జిన్‌కు పూర్తిస్థాయి ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ రొలాండో ఎన్రిక్ డోమింగో చెప్పారు. ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో అనుమతి కోసం కొవాగ్జిన్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. బుధవారమే ప్రపంచ ఆరోగ్య సంస్థతో సమావేశం కూడా నిర్వహించింది. మూడో దశ ట్రయల్స్‌లో 77 శాతం సమర్థంగా పని చేసినట్లు రిపోర్ట్ కూడా సమర్పించింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!
- నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ స్కూళ్లలో ఫొటోలు, వీడియోలపై కొత్త నిబంధనలు..!!
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్







