కోవిడ్ వ్యాక్సిన్ అందుకున్న 7,000 మందికి పైగా క్యాబ్ మరియు బస్ డ్రైవర్లు

- June 25, 2021 , by Maagulf
కోవిడ్ వ్యాక్సిన్ అందుకున్న 7,000 మందికి పైగా క్యాబ్ మరియు బస్ డ్రైవర్లు

యూఏఈ: ఇంటిగ్రేటెడ్ ట్రాన్సుపోర్ట్ సెంటర్ (ఐటిసి) - డిపార్టుమెంట్ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ట్రాన్సుపోర్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం 7,166 మంది డ్రైవర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగిందని తెలుస్తోంది. డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ అలాగే అబుదాబీ హెల్త్ సర్వీస్ కంపెనీ సహకారంతో అబుదాబీలో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాన్సుపోర్టు విభాగంలోని ఉద్యోగులు మరియు కార్మికులకు వ్యాక్సినేషన్ నిమిత్తం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఐటీసీ వెల్లడించిన వివరాల ప్రకారం పబ్లిక్ బస్ డ్రైవర్లందరికీ (1,460 మంది) వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. అదనంగా 5,706 మంది ట్యాక్సీ డ్రైవర్లకూ వ్యాక్సినేషన్ చేశారు. మొత్తం 6,938 మంది డ్రైవర్లు వున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com