కరోనా తో మరణించిన వ్యక్తికి ఒమన్ లో అంత్యక్రియలు
- June 26, 2021
మస్కట్: హైదరాబాద్ లో కుటుంబం తో నివాస ముంటున్న సంగారెడ్డి జిల్లా బీరంగుడా కు చెందిన పొందర లక్ష్మి నారాయణ పాత్రో గత పదునాలుగు సంవత్సరాలుగా ఒమన్ లోని ఒక కంపెనీ లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు.ఇటీవల కరోనా సోకడంతో పదిహేను రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 18 న తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని ఇండియా పంపడానికి వీలుకాక పోవడం తో సదరు కంపనీ యజమాన్యం ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు ను సంప్రదించగా వారు తమ బృందం తో ఈ రోజు సోహార్ లోని హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.ఈ సందర్భంగా నరేంద్ర వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ మృతిని కి సంబంధించిన పెండింగ్ బకాయిలు ఏమైనా ఉంటే కంపెనీ తో మాట్లాడి అతని కుటుంబానికి అందెలా చూస్తామని, తమ సంస్థ నుండి కూడా సహాయం అందిస్తామన్నారు.ఈ అంత్యక్రియల్లో మంచికట్ల కుమార్, మామిడి శ్యాం, పిట్ల రాజు, వెల్దుర్తి ప్రమోద్, వంకాయల కార్తీక్, వేమన కుమార్ కాశ, పర్లపెళ్లి రమేష్‌తో పాటు కంపెనీకి చెందిన పలువురు కార్మికులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!
- సౌదీ అరేబియాలో ఏడు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు..!!
- లోక్ భవన్లో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- గ్రామీణ కళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







