యూఏఈ: అక్టోబర్ 17 నుంచి T20 ప్రపంచ కప్
- June 26, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో జరగాల్సిన టీ 20 ప్రపంచ కప్ కరోనాతో తరలనుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, శ్రీలంక లేదా యూఏఈ లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసినట్లు తెలిసిందే. అయితే, ఇందులో యూఏఈ ని ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఈమేరకు టీ20 ప్రపంచ కప్ ను అక్టోబర్ 17 నుంచి యూఏఈలో మొదలు కానుంది. అలాగే నవంబర్ 14న ఫైనల్ జరగనుంది. ఈమేరకు బీసీసీఐ షెడ్యూల్ తయారు చేసిందని, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి తన నిర్ణయాన్ని తెలియజేనుందని బీసీసీఐ అధికారులు పేర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇందులో మొత్తం 16 దేశాలు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
యూఏఈలోని మూడు వేదికలు – అబుధాబి, షార్జా, దుబాయ్ లో టీ20 పోటీలు నిర్వహించనున్నారు.అలాగే టీ20 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లకు ఒమన్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
భారత్ లోనే టీ20 ప్రపంచ కప్‌ను నిర్వహించాలని అనుకున్న బీసీసీఐకి రెండు సమస్యలు వచ్చి పడ్డాయి. భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి టాక్స్ మినహాయింపు లభించలేదు. అలాగే కోవిడ్ కేసులు పెరుగుతున్న సందర్భంగా ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో మరలా విదేశీ ఆటగాళ్లు భారత్ వచ్చేందుకు ఒప్పుకుంటారనే అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.దీంతో బీసీసీఐ ఫైనల్‌గా యూఏఈని ఖరారు చేసిందంట.
కొన్ని వారాల క్రితం అన్ని రాష్ట్రసంఘాలతో జరిగిన వర్చువల్ సమావేశంలో బీసీసీఐ పలు వివరాలను తెలియజేసిందంట.టీ20 ప్రపంచకప్‌ను యూఏఈకి తరలించడం ద్వారా బోర్డుకు వచ్చే ఆదాయంలో దాదాపు 41 శాతం ఆదా అవ్వనుందని పేర్కొందంట.అదే భారత్‌లో ప్రపంచకప్ నిర్వహిస్తే బీసీసీఐ భారీగా టాక్స్ కట్టాల్సివస్తోందని తెలియజేసిందంట.
కాగా, 2016లో టీ 20 ప్రపంచ కప్ నిర్వహించినప్పుడు కూడా ప్రభుత్వ నుంచి పన్ను మినహాయింపు లభించలేదు.దీంతో యూఏఈకి తరలిస్తేనే మంచిదని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!







