కత్తి మహేష్ కి ఘోర రోడ్డు ప్రమాదం
- June 26, 2021
సినీ నటుడు ఫిల్మ్ క్రిటిక్ ‘బిగ్ బాస్’ ఫేమ్ కత్తి మహేష్ రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో కత్తి కత్తి మహేష్ కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. కత్తి మహేష్ నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలం, చంద్రశేఖర్ పురం జాతీయ రహదారిపై ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు ఆయన కారు వెనుక నుండి లారీని ఢీకొట్టింది.
తాజాగా కత్తి మహేష్ రోడ్ యాక్సిడెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. వీటిలో మహేష్ కు చెందిన ఇన్నోవా కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయి ఉంది. దీనిని బట్టి కారు బలంగా ట్రక్ ను ఢీ కొట్టినట్లు అర్థం అవుతుంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పట్ల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తలకు గాయాలు కావడం ఆందోళన కలిగిస్తుంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!







