జార్జి ఫ్లాయిడ్ హత్య కేసు..పోలీస్ అధికారికి 22.5 ఏళ్ల జైలు
- June 26, 2021
వాషింగ్టన్: ఆఫ్రికా అమెరికన్ జార్లి ఫ్లాయిడ్ మరణానికి కారణమైన మాజీ పోలీస్ అధికారి డెరిక్ చౌవిన్‌కు మిన్నియా పొలిస్కోర్టు ఇరవైరెండున్నరేళ్ల కారాగార శిక్ష విధించింది. చౌవిన్ సత్ప్రవర్తనను కనబరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత అతనికి పెరోల్‌కు అనుమతించవచ్చని స్పష్టం చేసింది. ప్రతిపాదిత మార్గదర్శకాల్లో ఉన్నట్టు ఎక్కువ కాలం జైలు శిక్ష విధించాలన్న ప్రాసిక్యూటర్ విజ్ఞప్తికి స్పందిస్తూ ఈ విధంగా తీర్పునిచ్చింది. ‘శిక్ష భావోద్వేగం, సానుభూతిపై ఆధారపడి లేదు’ అని న్యాయమూర్తి పీటర్ కాహిల్ అన్నారు. ప్రాసిక్యూటర్లు 30 సంవత్సరాల శిక్షను కోరిన తర్వాత మిన్నియాపాలిస్ కోర్టు ఫ్లాయిడ్ హత్య దశాబ్దాలుగా జాతి న్యాయం కోసం అమెరికా చేసిన అతిపెద్ద ప్రదర్శనలకు దారితీసింది.
కాగా, పోయినేడాది మే 25న జార్జ్ ఫ్లాయిడ్‌ను నడిరోడ్డుపై డెరిక్ చౌవిన్ మోకాలితో నొక్కి అదిమిపట్టాడు. తనకు ఊపిరి ఆడడం లేదని, కాలు తీయాలని ఫ్లాయిడ్ వేడుకున్నా డెరిక్ కనికరించలేదు. ఆ తర్వాత ఫ్లాయిడ్‌ను ఆసుపత్రికి తరలించగా మరణించాడు. ఇందుకు సంబంధించి వీడియోలు, పొటోలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
తాజా వార్తలు
- వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 55th Eid Al Etihad Team announces nationwide celebration venues
- బహ్రెయిన్‌లో ఫుడ్ ట్రక్కుల వ్యాపారంపై కొత్త చట్టం..!!
- దోహా మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్..!!
- ఇరాన్ దాడిలో గాయపడిన వారికి పరామర్శించిన రక్షణ మంత్రి..!!
- ధోఫర్ గవర్నరేట్‌లో అత్యవసర వైద్య తరలింపు ఆపరేషన్..!!
- సౌదీ, టర్కీ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో డ్రగ్స్ అక్రమ రవాణా.. వ్యక్తికి జీవిత ఖైదు..!!
- సముద్ర మార్గాల భద్రత దేశాల ఆర్థిక శ్రేయస్సుకు కీలకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- భవన్స్ పబ్లిక్ స్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించిన భారత రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి







