అనుమానిత కలయిక: ఆ ప్రాజెక్టుల విలువ 1 బిలియన్ సౌదీ రియాల్స్
- June 26, 2021
రియాద్: జనరల్ అథారిటీ ఫర్ కంపిటీషన్ గవర్నర్ డాక్టర్ అబ్దుల్ అజీజ్ అల్ జూమ్ వెల్లడించిన వివరాల ప్రకారం కొన్ని ప్రాజెక్టుల్లో అనుమానిత కలయికలు చోటు చేసుకున్నాయనీ, ఆ ప్రాజెక్టుల విలువ 1 బిలియన్ సౌదీ రియాల్స్ వుంటుందని తెలుస్తోంది. అల్ జూమ్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాదిలో ఇలాంటివి 86 వరకు సంస్థలు వున్నాయనీ, 2019లో వీటి సంఖ్య 15గా వుందని ప్రకటన ద్వారా అర్థమవుతోంది.ఈ తరహా ఘటనలకు సంబంధించి విచారణ జరుగుతోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.వర్క్ షాపులు, అవగాహనా కార్యక్రమాలు చేపడుతూ ప్రొక్యూర్మెంట్ మరియు కంట్రాక్ట్ డిపార్టుమెంట్లకు (ప్రభుత్వ మరియు ప్రైవేట్ సెక్టార్లు) మరింత చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నామని అథారిటీ తెలిపింది. ప్రభుత్వ టెండర్లు, ప్రొక్యూర్మెంట్ మరియు కాంపిటీషన్ చట్టం మధ్య ప్రతి విషయం పారదర్శకంగా వుండేందుకోసం వెరిఫికేషన్ పద్ధతుల్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అమల్లోకి తెస్తున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







