ఇళ్ళ నుంచి ఖాళీ చేయబడ్డ 8000 మంది వలస బ్యాచిలర్లు
- June 26, 2021
కువైట్ సిటీ: క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ తలాల్ అల్ ఖాలెద్ అల్ సబాహ్ మాట్లాడుతూ, భిల్డింగ్ ఉల్లంఘన నేపథ్యంలో 8,000 మంది వలస బ్యాచిలర్లను వారి ఇళ్ళ నుంచి ఖాళీ చేయించినట్లు తెలిపారు. బిల్డిం్ కోడ్స్ మరియు రెగ్యులేషన్లను, మరీ ముఖ్యంగా హెల్త్ నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా ఈ చర్యలు చేపట్టినట్లు అల్ ఖాలెద్ పేర్కొన్నారు. వారి సివిల్ ఐడీలతో వారి వాస్తవ లివింగ్ సిట్యుయేషన్ సరి తూగలేదు. 206 భవనాల్లో 165 భవనాల్లో ఉల్లంఘనలు వెలుగు చూశాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ ఉల్లంఘనలకు బాధ్యత వహించాలని గవర్నర్ పేర్కొన్నారు. కాగా, కార్మికుల కోసం ఆరు లేబర్ సిటీలను కువైట్ వ్యాప్తంగా నిర్మించనున్నట్లు మునిసిపాలిటీ 2016లో వెల్లడించింది. అల్ జ్రా లేబర్ సిటీ ప్రభుత్వ అలాగే ప్రైవేటు సెక్టార్ భాగస్వామ్యంతో నిర్మితమైంది. 2021లో ఇది పూర్తయ్యింది. 20,000కి పైగా కార్మికులు ఇక్కడ వుండే అవకాశముంది. 2017లోనే దీన్ని పూర్తి చేయాల్సి వుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







