హజ్ 2021: కొనసాగుతున్న చివరి దశ రిజిస్ట్రేషన్
- June 26, 2021
సౌదీ: రెండవ మరియు చివరి దశ రిజిస్ట్రేషన్ హజ్ కోసం కొనసాగుతోంది. సౌదీ గెజిట్ వెల్లడించిన వివరాల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, జులై 9 రాత్రి 10 గంటల వరకు చివరి ఫేజ్ రిజిస్ట్రేషన్ యాత్రీకుల కోసం కొనసాగనుంది. అందుబాటులో వున్న స్లాట్స్ మీద ఆధారపడి దరఖాస్తుల స్వీకరణ ఆధారపడి వుంటుందని మినిస్ట్రీ పేర్కొంది. హజ్ కోసం అర్హత సాధించినవారికి ఎస్.ఎం.ఎస్. ద్వారా సమాచారం పంపిస్తున్నట్లు మినిస్ట్రీ వివరించింది. ఎవరైతే అర్హత సాధించారో వారు మాత్రమే పోర్టల్ ద్వారా సమాచారం పొందగలుగుతారు. అర్హత సాధించినవారు తమతోపాటు మరొకర్ని (గతంలో ఖచ్చితంగా హజ్ కోసం దరఖాస్తు చేసుకుని వుండాలి) సహచరుడిగా నమోదు చేయవచ్చు. సనాద్ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానం ద్వారా చెల్లింపులు చేయాల్సి వుంటుంది. చివరి దశలో హజ్ అనుమతులు జారీ అవుతాయి.
తాజా వార్తలు
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?
- ఒమన్ లో భారీ వర్షాలు..భద్రతా హెచ్చరికలు జారీ..!!









