కోవిడ్ రూల్స్ బ్రేకర్స్ పై కఠిన చర్యలు
- June 27, 2021
బహ్రెయిన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి నుంచి బహ్రెయిన్ ప్రజలను రక్షించుకోవటం ప్రభుత్వ విభాగాలు, ప్రజల ఉమ్మడి బాధ్యతని బహ్రెయిన్ పోలీస్ డైరెక్టరేట్లు అభిప్రాయపడ్డాయి. ప్రజల్లో అవగాహన కల్పించటం, అదేవిధంగా ప్రజలు కూడా సమాజ భద్రతకు తమ వంతు బాధ్యతగా కోవిడ్ నిబంధనలు పాటించటం అత్యవసరం అనే విషయాన్ని అందరూ దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అంతర్గత మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో పలు గవర్నరేట్లలో పోలీస్ డైరెక్టరేట్ల వారీగా పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వాహించినట్లు అధికారులు వెల్లడించారు. అవగాహన కార్యక్రమాలతో పాటు కోవిడ్ రూల్స్ అమలుపై కూడా అదే స్థాయిలో ఫోకస్ చేశామన్నారు. జూన్ 23 నాటికి బహ్రెయిన్ లోని పలు పోలీస్ డైరెక్టరేట్ల పరిధిలో వేల సంఖ్యలో కేసులు నమోదు చేసినట్లు వివరించారు. సమాజిక దూరాన్ని పాటించనందుకు 10,860 మందిపై కేసు నమోదు చేశామని, మాస్క్ ధరించని 91043 మందిపై కేసులు బుక్ చేశామన్నారు. ఇదిలాఉంటే...ఇప్పటివరకు కోవిడ్ నిబంధనలు, పాటించాల్సిన జాగ్రత్తలపై 12,426 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







