మెట్రాష్2 యాప్ ప్రారంభం..మొబైల్లోనే డిజిటల్ డాక్యుమెంట్స్
- June 28, 2021
ఖతార్: డిజిటలైజేషన్ విజన్ లో భాగంగా ఖతార్ ప్రభుత్వం మెట్రాష్2 యాప్ తో ఈ-వాలెట్ సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మెట్రాష్ 2 యాప్ తో వ్యక్తిగత డాక్యుమెంట్లను మొబైల్ లోనే క్యారీ చేయవచ్చు. ఖతార్ గుర్తింపు కార్డు, రెసిడెన్సీ పర్మిట్ డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్, ఫ్యాన్సీ నెంబర్ ఓనర్ షిప్ ఇలా అన్ని వ్యక్తిగత ధృవ పత్రాలను ఒక్క క్లిక్ తో మీ అరచేతిలో ఉంటాయి. అవసరం అనుకుంటే డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో స్టోర్ చేసుకోవచ్చు. దీంతో అంతర్గత మంత్రిత్వ శాఖలో ఎలాంటి సేవలు పొందాలన్నా, అధికారులకు కావాల్సిన డాక్యుమెంట్లను చూపించాలన్నా మైట్రాష్ 2 యాప్ ఈ-వాలెట్ సర్వీస్ ద్వారా చూపించొచ్చు. పలు రకాల సేవల సమయంలోనూ ఈ-వాలెట్ లోని డాక్యుమెంట్ల ద్వారా పనులు చక్కబెట్టుకోవచ్చు. అలాగే ఒకవేళ భద్రతా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, ఇతర సంబంధిత అధికారులు డాక్యుమెంట్లను అడిగిన వెంటనే ఈ-వాలెట్ లోని డాక్యుమెంట్లను చూపించవచ్చు. అంటే మెట్రాష్ 2 యాప్ తో ప్రజలు ఫిజికల్ డాక్యుమెంట్లను క్యారీ చేయాల్సిన ప్రయాస తప్పుతుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్‌జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









