వ్యాక్సినేష‌న్‌లో భారత్ మ‌రో రికార్డ్‌…

- June 28, 2021 , by Maagulf
వ్యాక్సినేష‌న్‌లో భారత్ మ‌రో రికార్డ్‌…

న్యూ ఢిల్లీ: భారత్ లో వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అమ‌లు చేస్తున్నారు.జూన్ 21  వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి ఉచిత వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు.రోజుకు ల‌క్ష‌ల సంఖ్య‌లో వ్యాక్సిన్‌ను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ ఏడాది జ‌న‌వ‌రి 16 నుంచి వ్యాక్సినేష‌న్‌ను ప్రారంభించారు.మొద‌ట్లో మంద‌కోడిగా సాగిన వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన్ని రోజులుగా వేగంగా అమ‌లు చేస్తున్నారు.

అయితే, వ్యాక్సినేష‌న్ విష‌యంలో భారత్ మ‌రో కొత్త రికార్డ్ ను సాధించింది.ప్ర‌పంచంలో అత్య‌ధిక మందికి వ్యాక్సిన్ అందించిన దేశంగా భారత్ అవ‌త‌రించింది.భారత్లో ఇప్ప‌టి వ‌ర‌కు 32,36,63,297 మందికి వ్యాక్సిన్‌ను అందించారు.అమెరికాలో 32,33,27,328 మందికి వ్యాక్సిన్ అందించారు.భారత్, అమెరికా త‌రువాత ఇంగ్లాండ్‌,జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, ఇట‌లీ దేశాలు ఉన్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com