నేడు పీవీ నరసింహారావు జయంతి..ఉపరాష్ట్రపతి,ప్రధాని నివాళులు
- June 28, 2021
న్యూఢిల్లీ: పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు,ప్రధాని మోదీ నివాళులర్పించారు.ఈ సందర్భంగా వెంకయ్యానాయుడు మాట్లాడుతూ పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడని, ఆర్థిక సంస్కరణ మార్గదర్శి అని అన్నారు. బముముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులర్పిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. స్వావలంబన, స్వయం సమృద్ధికి పీవీ పెద్ద పీట వేశారని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.దేశ భవిష్యత్తుకు పీవీ బాటలు వేశారన్నారు.మాతృభాషకు పీవీ చాలా ప్రాధాన్యతమిచ్చారని చెప్పారు. పీవీ సేవలను జాతి చిరకాలం గుర్తు పెట్టుకుంటుందని వెంకయ్య స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశాభివృద్ధికి పీవీ చేసిన కృషిని దేశం గుర్తుచేసుకుందని తెలిపారు.పీవీ గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నారు.
కాగా, పీవీ నరసింహారావు జూన్ 28, 1921లో వరంగల్ జిల్లాలో జన్మించారు.మంథని నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా మొత్తం వివిధ స్థానాల్లో పోటీ చేసి 6 సార్లు ఎంపీగా గెలిచారు.1996లో నంద్యాల నుంచి ఎంపీగా గెలిచారు.తెలుగు వ్యక్తి ప్రధాని అవుతున్నాడని ఎన్టీఆర్ వీపీకి పోటీగా అభ్యర్థిని నిలబెట్టకపోవడం విశేషం.రాజీవ్ గాంధీ హయాలో 9వ ప్రధాన మంత్రిగా పని చేశారు. దేశంలో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలే ఇప్పటికీ దేశంలో కొనసాగుతూనే ఉన్నాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







