తెలంగాణ: విదేశాలకు వెళ్లే ఉద్యోగులకు వ్యాక్సిన్..
- June 28, 2021
తెలంగాణ: వ్యాక్సిన్ నేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.. ప్రాధాన్యత ప్రకారం వ్యాక్సినేషన్ చేస్తూ వస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇస్తుండగా..ఇప్పుడు విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే వారికి వ్యాక్సిన్‌పై గైడ్‌లైన్స్ విడుదల చేశారు.. ఉద్యోగ అవసరాలపై విదేశాలకు వెళ్లే వారికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్టు ప్రకటించింది ఆరోగ్య శాఖ.. విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లేవారు పాస్ పోర్ట్, వర్క్ పర్మిట్ వీసాలను చూపించి ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ పొందవచ్చని ఆరోగ్య శాఖ వెల్లడించింది.. అర్హులైన వారికి కోవిషీల్డ్ టీకాలను 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం…అంతేకాదు.. విదేశాలకు వెళ్లే ఉద్యోగస్తుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 వ్యాక్సిన్ కేంద్రాలను కేటాయించింది వైద్య ఆరోగ్య శాఖ.
వ్యాక్సిన్ కేంద్రాల వివరాలు...
ఆదిలాబాద్-పిపి యూనిట్ రిమ్స్
నిజామాబాద్-యుపీహెచ్సి వినాయక్ నగర్
కరీంనగర్-యుపీహెచ్సి బుట్టరాజారాం కాలనీ
వరంగల్-యుపీహెచ్సి లక్సర్ సింగారం
ఖమ్మం-యుపీహెచ్సి వెంకటేశ్వర్ నగర్
మెదక్-యుపీహెచ్సి మెదక్
మహబూబ్ నగర్-యుపీహెచ్సి రామయ్య బౌలీ
నల్గొండ-యుపీహెచ్సి పంగల్
రంగ రెడ్డి-యుపీహెచ్సి సరూర్ నగర్
హైదరాబాద్-యుపీహెచ్సి,ఆర్టిఎఫ్సి యుపీహెచ్సి తరమైదాన్
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







