APNRTS కార్యాలయాన్ని సందర్శించిన టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
- June 28, 2021
విజయవాడ: కరోనా నియంత్రణకు సంబంధించిన సామాగ్రిని టీటీడీ మాజీ చైర్మన్, వైయస్ఆర్ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆసుపత్రులకు పంపిణీ చేశారు.సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో కరోనా నియంత్రణలో ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబరుస్తుందని సుబ్బారెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.కరోనా వైరస్ నియంత్రణ, లాక్డౌన్ అమలు చేస్తున్న తీరు, నిర్వహిస్తున్న పరీక్షలు, కేసుల తీవ్రత, వ్యాక్సినేషన్లో దేశంలోనే ఏపీ ముందుందని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని APNRTS చైర్మన్ మేడపాటి వెంకట్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ సభ్యుల బృందం సహకారంతో కొనుగోలు చేసిన ఈ కరోనా నియంత్రణ సామాగ్రిని సుబ్బారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయించారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తోందన్న సుబ్బారెడ్డి, ఏపీలో కొవిడ్-19ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సీఎం వైయస్ జగన్ ఆదేశాలతో వైద్య, ఆరోగ్యశాఖ 108, 104 సేవలను మరింత విస్తృతంగా వినియోగిస్తోందన్నారు.
కోవిడ్ అత్యవసర పరిస్థితుల్లో 104 కాల్ సెంటర్లను మరింత బలోపేతం చేసి, ఫోన్ చేసిన వెంటనే వైద్యబృందాలు కోవిడ్ పేషంట్లకు వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. గ్రామ సచివాలయాన్ని ప్రాతిపాదికగా తీసుకుని రాష్ట్రంలో 104 వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని.. కరోనా విపత్తులో 108 అంబులెన్స్‌లు ప్రజల పాలిట అపర సంజీవనిలా సేవలు అందిస్తున్నాయని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







