బహ్రెయిన్: భారత రాయబారికి స్వాగతం పలికిన LMRA చీఫ్ ఎగ్జిక్యూటీవ్
- June 30, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ భారత రాయబారిగా కొత్త నియామకమైన పియూష్ శ్రీవస్తవకి లేబర్ మార్కెట్ రెగ్యూలేటరీ అథారిటీ-LMRA చీఫ్ ఎగ్జిక్యూటీవ్ జమాల్ అబ్దుల్లాజీజ్ అల్ అలావి సాదర స్వాగతం పలికారు. బహ్రెయిన్ కు భారత రాయబారిగా నియామకం అయినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్-బహ్రెయిన్ మధ్య దౌత్య సంబంధాల వ్యవహారాలను ఆయన విజయవంతంగా నిర్వహించాలని అభిలాషించారు. భారత ఎంబసీ కార్యాలయం..బహ్రెయిన్ ప్రభుత్వ సంస్థలతో కలిసి ప్రవాసీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే బహ్రెయిన్ అభివృద్ధిలో భారత కార్మిక శక్తి కృషిని ఎంతో ఉందని ఇండియన్ అంబాసిడర్ పియూష్ శ్రీవస్తవకు వివరించారు. అలాగే బహ్రెయిన్ లోని ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. అటు భారత రాయబారి పియూష్ శ్రీవస్తవ కార్మికుల సంక్షేమానికి బహ్రెయిన్ చేపడుతున్న చర్యలను ప్రశంసించారు. ముఖ్యంగా భారతీయు కార్మికుల పట్ల చూపుతున్న చొరవను కొనియాడారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







