'సభకు నమస్కారం' అంటున్న అల్లరినరేష్
- June 30, 2021
'అల్లరి' చిత్రంతో తన ప్రస్థానం మొదలుపెట్టిన నరేష్ ఆ తరువాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒకప్పుడు కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నరేష్.. ఇప్పుడు నటుడిగా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. 'అల్లరి' నరేశ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తాజా చిత్రం 'సభకు నమస్కారం' తాలూకు టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. టైటిల్ కి తగినట్టుగానే ఆయన సభకు నమస్కారం చేస్తున్న పోస్టర్ ను వదిలారు. ఈస్ట్ కోస్ట్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లంపాటి సతీష్ దర్శకత్వం వహిస్తున్నాడు. అబ్బూరి రవి సంభాషణలు సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 'నాంది' తరువాత 'అల్లరి' నరేశ్ చేస్తున్న సినిమా ఇది.. కెరీర్ పరంగా ఇది ఆయనకు 58వ సినిమా.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్‌లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









