మద్యం తాగి వాహనం నడిపితే ఆరు నెలలు జైలు శిక్ష ..
- July 01, 2021
హైదరాబాద్: ఒక చేత్తో మందు బాటిల్.. మరో చేత్తో స్టీరింగ్.. సినిమా కాదురా బాబు జీవితం.. అక్కడ నటిస్తే సరిపోతుంది.. ఇక్కడ అలా చేస్తే జీవితం ముగిసిపోతుంది. మహా నగరాల్లో తిన్నగా నడిపితేనే ఇంటికి చేరుకోవడం కష్టంగా ఉంటుంది. ఇక తాగి నడిపితే అదృష్టం బావుంటే ఇంటికి లేదంటే అంతే సంగతులు. తాజాగా మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై పోలీసులు మరోసారి దృష్టి సారించారు. ఇకపై వారానికి మూడు రోజులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇలా తాగి నడిపే వారికి రూ.10 వేల జరిమానా, ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రదుదు చేశారు. 210 మందికి జైలు శిక్ష విధించారు.
రహదారులపై ప్రమాదాలను నియంత్రించేందుకు, ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల సవరణ చట్టం అమల్లోకి తెచ్చింది. పోలీసులు నివేదిక ఆధారంగా జైలు శిక్షలు, లైసెన్సు రద్దులపై కోర్టులు ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. లాక్టౌన్ అనంతరం పబ్బుల్లో పార్టీలు జోరందుకున్నాయి. నాలుగైదు రోజులుగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో పార్టీలు జరుగుతుండడాన్ని పోలీసులు గుర్తించారు. అర్థరాత్రి దాటాక కార్లు, జీపుల్లో మందుబాబులు వెళ్తున్నట్లు వారి నిఘాలో తెలుసుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేయనున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







