విజయవాడ విమానాశ్రయం: ఈ నెల 15న నూతన రన్‌వే ప్రారంభం...

- July 01, 2021 , by Maagulf
విజయవాడ విమానాశ్రయం: ఈ నెల 15న నూతన రన్‌వే ప్రారంభం...

విజయవాడ: గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. ఏపీలో రెండవ అతిపెద్ద విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా అధునాతన రన్ వే నిర్మితమైంది. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు జిల్లా కలెక్టర్‌ను కలిసి విమానాశ్రయ విస్తరణ పనుల గురించి వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ నివాస్‌ మాట్లాడుతూ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం 700 ఎకరాల్లో విస్తరణ పనులు చేపట్టామని తెలిపారు.ఈ పనులకు సంబంధించి ఎయిర్‌ పోర్టు అథారిటీకి జిల్లా యంత్రాంగం అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు.ఇంకా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, రహదారుల విస్తరణకు సంబంధించి రెవెన్యూ అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.విమానాశ్రయంలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేయనున్న ప్‌లై ఓవర్‌కు సంబంధించి అవసరమైన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ నివాస్‌ అధికారులను కోరారు.ఈ సమావేశంలో జీఎం మహ్మద్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com