రోజూ 1 శాతం మంది అర్హులైనవారికి వ్యాక్సినేషన్

- July 01, 2021 , by Maagulf
రోజూ 1 శాతం మంది అర్హులైనవారికి వ్యాక్సినేషన్

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వ్యాక్సినేషన్ కమిటీ సభ్యుడు డాక్టర్ ఖాలెద్ అల్ సయీద్ మాట్లాడుతూ, కువైట్ దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. గత సోమవారం 47,000 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగిందని తెలిపారాయన. 1 శాతం కంటే ఎక్కువ అర్హులైనవారికి ప్రతిరోజూ వ్యాక్సినేషన్ చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు అలాగే పాలిచ్చే స్త్రీలకు కూడా వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. కరోనా మరణాలు పెరుగుతున్నందున, వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారాయన. కాగా, డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తోందనీ, ప్రధానంగా వ్యాక్సిన్ పొందనివారిపై ఎక్కువ ప్రభావం చూపుతోందని తెలిపారు డాక్టర్ ఖాలెద్ అల్ జరాలియా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com