ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు..

- July 01, 2021 , by Maagulf
ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు..

ప్రిలిమినరీ సెలక్షన్‌ బోర్డ్‌(పీఎస్బీ) అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ రంగంలోని ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జులై 4 నుంచి ప్రారంభమవుతోన్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* గ్రౌండ్‌ డ్యూటీ, టెక్నికల్‌ (ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌) విభాగాల్లో మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* గ్రౌండ్‌ డ్యూటీ (40), టెక్నికల్‌ విభాగంలో (10) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణ 4 జులై నుంచి ప్రారంభమవుతుండగా 14 జులైన ముగియనుంది.
* పీఎస్‌బీ ప్రిలిమ్స్‌ పరీక్షను జులై 20న నిర్వహించనున్నారు.
* పూర్తి వివరాల కోసం ఈ లింకు https://joinindiancoastguard.gov.in/ క్లిక్ చెయ్యండి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com