వైద్యులే ఇప్పుడు లోక రక్షకులు: టి.గవర్నర్
- July 01, 2021
హైదరాబాద్:ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో అసమానమైన, నిస్వార్థ సేవలందిస్తున్న వైద్యులే ఇప్పుడు నిజమైన ప్రాణ, లోక రక్షకులు అని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ బ్రాంచ్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో గవర్నర్ ఈ రోజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ. . తమ జీవితాలను సైతం లెక్కచేయకుండా వైద్యులు లక్షలాదిమంది బాధితుల జీవితాలను రక్షిస్తున్నారు అని అన్నారు.వారి నిస్వార్ధమైన సేవలు, శ్రద్ధ, అంకితభావం లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాయని గవర్నర్ వైద్యుల సేవలను కొనియాడారు.వైద్యుల దినోత్సవం వారికి కృతజ్ఞతలు చెప్పడానికి, వారి సేవలను గుర్తించి గౌరవించడానికి ఒక సరైన సమయం గా ఉంటుందని డాక్టర్ తమిళిసై అన్నారు.
తాను తన కుటుంబ సభ్యులు వైద్యు లే కావడం వల్ల.. వైద్య రంగంలో ఉన్న వారి ఆలోచనలు, బాధలు బాధ్యతలు అర్థం చేసుకోగలమని, వైద్యులకు తన సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందని గవర్నర్ అన్నారు.భారతరత్న డాక్టర్ బీసీ రాయ్ జయంతిని జాతీయ వైద్యుల దినోత్సవం గా జరుపుకుంటున్న సందర్భంలో ఆయనకు గవర్నర్ నివాళులు అర్పించారు.
వైద్యులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







